Rakul Preet Singh top athletic wear pictures amid COVID-19
టాలీవుడ్ లో ఎప్పుడు ఏ హీరోయిన్ టాప్ రేంజ్ కి చేరుతుందో ఎప్పుడు డీ గ్రేడ్ అవుతుందో తెలీదు. ఎందుకంటే, చాలామంది ఇప్పుడు మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటారు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్టయితే ఇక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోను వరుసబెట్టి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లొస్తాయి. బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తూ తమ ఖాతాలలో వేసుకుంటారు. ఇక కొందరైతే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశ్యంతో రెమ్యూనరేషన్ కూడా కోట్లలో డిమాండ్ చేస్తారు. లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ ఇలా పేర్లు కొట్టేస్తారు. అదే ఒక్క సినిమా ప్లాప్ అయిందనుకోండి… ఎంత స్పీడ్ గా అయితే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటారో అంతే వేగంగా డౌన్ కి చేరతారు.
డీ గ్రేడ్ అయిపోయాక వరుస ఫ్లాప్స్ తో చిత్ర పరిశ్రమ నుంచి డోర్స్ క్లోజ్ అయిపోయి, హీరోయిన్ గా ఒక్క ఛాన్స్ వచ్చినా చాలు అనుకుంటూ మళ్ళీ మొదటికే వస్తారు. డౌన్ అయిపోయాక ఒక మెట్టు దిగొచ్చి , కంగారులో కొన్ని తప్పులు చేసి మరిన్ని ఇబ్బందుల్లో పడిపోతారు. బ్యూటి క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి తప్పే చేసిందట. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ కి చేరడంతో పాటు పూజాహెగ్డే – రష్మిక లాంటి లక్కీ హీరోయిన్స్ ని తట్టుకోలేక రకుల్ కోలుకోలేని స్థితికి వచ్చేసింది.
సరిగ్గా అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ చివరకు కింగ్ నాగార్జున తో కల్సి ‘మన్మథుడు 2’ లో నటించింది. ఆ మూవీ ఒప్పుకొని పెద్ద పొరపాటు చేసిందని టాక్ వచ్చింది. నిజానికి కెరీర్ దెబ్బతిన్న స్టేజ్ లో ఛాన్స్ వచ్చింది కదా వదలడం ఎందుకని నటిచింది. ఈ సినిమాతో మళ్ళీ కెరీర్ ఫాం లోకి వస్తుందని ఊహించుకుంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే లిప్ లాక్స్ ఉన్నా, బోల్డ్ గా నటించాల్సి ఉందని తెలిసినా, కెరీర్ మీద ఆశ పడి ఒప్పుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో రాంగ్ స్టెప్ వేశానని ఇప్పుడు బాధపడుతోంది. మొత్తానికి నితిన్ సరసన ఒక సినిమాలో నటించే అవకాశాన్ని ప్రస్తుతం సంపాదించుకుంది. మరి అది ఎలా అవుతుందో చూడాలి.