Sunday, July 25, 2021

Latest Posts

ఎన్టీఆర్ చేస్తున్న షో కి గెస్ట్ గా చరణ్

Ram Charan As Guest For NTR Show

టాలీవుడ్ టాప్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఈ స్టార్ హీరోలు ఇద్దరూ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ లో కనిపిస్తున్నారు. తాజాగా, నిన్న మేకర్స్ మేకింగ్ వీడియోను ఆవిష్కరించారు. ఈ వీడియో లో వచ్చిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. నందమూరి మరియు మెగా హీరో కలిసి సినిమా చేస్తుండడంతో సినిమా పై మరిన్ని అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఎన్‌టి‌ఆర్ ఒక టీవీ షోలో కనిపించనున్నాడు. అదే ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోరోపతి’ తెలుగులో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ గా రానున్నది. ఈ షో జెమిని టివిలో ప్రసారం కానున్నది. అయితే ఈ షో ప్రమోషన్ కోసం సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంది. దీంట్లో భాగంగా చరణ్ ని గెస్ట్ గా పిలిచిన్నట్టు సమాచారం.

హోస్ట్‌గా తారక్ చరణ్‌ను హాట్ సీటుకు ఆహ్వానించడం ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది మరియు టి‌ఆర్‌పి తార స్థాయికి వెళుతుంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది అనేది మాత్రం ఇంకా తెలియదు. బహుశా ఈ ఎపిసోడ్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సమయంలో ప్రసారం అవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss