Ram Charan Childhood Pics
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం విశేషం. చిన్నప్పటి నుంచి రాణా, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఒకే స్కూల్ లో, ఒకే కాలేజీ లో చదువుకున్నారు. కాగా వీరిద్దరివి సినీ ఫ్యామిలీలు కావడం వలన ఒకే సారి వీరు చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి చరణ్, రానా ఒకే స్కూల్ లో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్నేహితులుగా వారి ప్రయాణం నడుస్తుంది. రాణా ఒక సారి ఆడియో ఫంక్షన్ లో చరణ్ కు నాకు మా ఫాథర్స్ అంటే భయం లేదని, మా ఇద్దరికీ అరవింద్ గారు అంటే భయం అని, మేం స్కూల్ ఎగ్గొట్టిన, కాలేజీ ఎగ్గొట్టిన వెంటనే అరవింద్ గారికి తెలిసి మా ఇంట్లో చెప్పే వారని తన చిన్న నాటి జ్నాపకాలు చెప్పాడు. చరణ్ కూడా రాణా తనకు ఇండస్ట్రి లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పుడు చెబుతూనే ఉంటాడు. కాగా దానికి ఈ ఫోటో నే సాక్షం.
View this post on Instagram
10th class picture of #RamCharan, @ranadaggubati , @allusirish , @alwaysramcharan