Ram Charan Hilarious Fun With His Grandmother :
కరోనా మహమ్మారి వల్ల క్వారంటిన్ లో ఉన్న సినీ తారలు తమకు నచ్చిన వంటలను నేర్చుకుంటూ, ఆ వీడియోలును సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే రాంచరణ్ కూడా రాజమౌళి విసిరిన #బి ద రియల్ మాన్ ఛాలెంజ్ ను స్వీకరించి, తన భార్య ఉపాసనాకు ఇంటి పనులలో సాయం చేస్తూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే ఉపాసనా కూడా చరణ్ బర్త్ డే రోజున తానే స్వయంగా కేక్ చేసి చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. కాగా మెగా స్టార్ చిరంజీవి కూడా తన తల్లికి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
తాజాగా పిండి వంటలు చెయ్యడానికి తన అమ్మ, అమ్మమ్మల సహాయం తీసుకున్న చరణ్, తన అమ్మమ్మను ఆ పిండి వంట నేర్చుకునేటప్పుడు ఆట పట్టించే వీడియో ప్రస్తుతం మెగా అభిమానులకు జోష్ ని ఇస్తుంది. తాజాగా చరణ్ వల్ల నేను సోషల్ మీడియాలోకి రావడం జరిగింది, నా అభిమానులకు దగ్గరగా ఉండడం, నాకు నచ్చిన విషయాలను వాళ్ళతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. యేదైతేనే మెగా హీరోలు పెడుతున్న వంట వీడియోలు మెగా అభిమానులతో పాటు సినీ జనాలకు కూడా ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి ఈ లోక్ డౌన్ సమయంలో.