Monday, March 8, 2021

Latest Posts

మహేష్ తో సినిమా నిర్మించబోతున్న చరణ్..??

Ram Charan is going to make a movie with Mahesh

సంక్రాంతి కి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన నెక్స్ట్ మూవీ ని ఇంకా ప్రకటించలేదు.  దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సివుండగా అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది.ఇక  గీత గోవిందం హిట్ తో ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన డైరెక్టర్ పరుశురాంతో మహేష్ మూవీ దాదాపు ఫిక్స్  అయినట్లే అనిపిస్తుంది.  అయితే దీనిపై కృష్ణ పుట్టినరోజు  May, 31 న స్పష్టత రావచ్చు. అయితే  ఇప్పుడు టాలీవుడ్ లో ఓక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అది మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని హీరో రామ్ చరణ్ చేయబోతున్నారట.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించగా… ఆ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరనేది తేలాల్సివుంది. బహుశా అది పరుశురాం మూవీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇక రాజమౌళితో మహేష్ చేయనున్న చిత్రాన్ని  నిర్మాత కె ఎల్ నారాయణ నిర్మిస్తుండగా… ఆ మూవీకి ముందే మహేష్ కనీసం రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో రామ్ చరణ్ నిర్మించే మహేష్ చిత్రం ఆ రెండు చిత్రాలలో ఒకటి కావచ్చు. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సి వుంటుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss