Sunday, June 20, 2021

Latest Posts

మరో సారి బాలీవుడ్ భామతో రొమాన్స్ చేయనున్న రామ్ చరణ్

Ram Charan Shankar Movie Heroine

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డివివి దానయ్య తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌తో అరంగేట్రం చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీ గా చేస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, మరోసారి ఆలియా భట్ రామ్ చరణ్ తో సినిమా చేయనుందట. ఆర్‌ఆర్‌ఆర్ విడుదలైన తరువాత, రామ్ చరణ్ దర్శకుడు శంకర్‌తో కలిసి సినిమా చేయనున్నాడు. ఇది ఒక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. ఈ నేపధ్యంలో ఆలియా మరో సారి రామ్ చరణ్ తో జోడీ కడితే బాగుంటుందని యోచిస్తున్నాడట శంకర్. ఈ విషయమై ఆలియాతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఇకపోతే ఈ రామ్ చరణ్ 15వ చిత్రంలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, వాటిని 3 డిలో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారని శంకర్ అభిప్రాయపడ్డారు. శంకర్ ఇంతక ముందు కూడా అక్షయ్ కుమార్, రజనీకాంత్ మరియు అమీ జాక్సన్ తో కలిసి 2.0  ని 3 డిలో చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss