Thursday, May 13, 2021

Latest Posts

ఉపాసన నీకు పిచ్చి పట్టిందా నెటిజన్లు ఆందోళన

Ram Charan Upasana
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడేలా కనిపిస్తోంది. మెగా ఇంట్లో వరుసగా ఈవెంట్లు జరగడం అందరి కొంప ముంచేలా ఉన్నాయి. చివరగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం రచ్చ చేశారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. కరోనా పాజిటివ్ వచ్చిందని రామ్ చరణ్ ప్రకటించిన కొద్ది గంటలోనే వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడటం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తాజాగా ఉపాసన చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది.

రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అందరూ అందోళన చెందుతున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన ఒకే ఇంట్లో ఉంటారు. దీంతో ఉపాసనకు కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే విషయంలోకి వెళితే రామ్ చరణ్‌తో తాను క్వారంటైన్‌లో ఉన్నానంటూ ఉపాసన తెలిపింది. ఈ గడ్డుకాలం కూడా గడిచిపోతుంది.. 2021లో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.. కరోనా లక్షణాలేవీ కనిపించడం లేదు.. ఆయన స్ట్రాంగ్‌గా ఉన్నాడు.. నాకు కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది.. పరీక్షలు చేస్తే మాత్రం నెగెటివ్ వచ్చిందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్ పాజిటివ్ తేలడంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు.అయితే రామ్ చరణ్ వెంట ఉపాసన కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ.. క్వారంటైన్‌ను మిస్టర్ సీతో గడుపుతున్నానంటూ ఫోటోను షేర్ చేసింది. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి వంటివి తీసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కరోనా నెగిటివ్ వచ్చిన నువ్వు ఎలా ఉంటావ్ అంటూ నీకు పిచ్చి పట్టిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

  • ముద్దోస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకుల ఫోటోలు చూశారా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss