Tuesday, January 25, 2022

Latest Posts

రామ్ చరణ్ 25 లక్షలు గెలుచుకున్నాడు

Ram Charan Wins 25 Lakhs In Game Show

రామ్ చరణ్ ప్రతి చిత్రానికి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడు అని మనందరికీ తెలుసు. కానీ ఈసారి ఆసక్తికరమైన విషయంపై రూ.25 లక్షల నగదు గెలుచుకున్నాడు. అదే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు మొదటి ఎపిసోడ్‌లో. ఈ ఎపిసోడ్ ఆగస్టు 16న ప్రసారం కానుంది.

ఈ షో ద్వారా కోటి రూపాయిలు గెలిచే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతి ప్రశ్నకు డబ్బు రెట్టింపు అవుతూ చివరకు కోటి రూపాయిలు గెలవవచ్చు. అయితే రామ్ చరణ్ కూడా ఇలానే తన జనరల్ నాలెడ్జ్ మరియు లైఫ్ లైన్లను ఉపయోగించడం ద్వారా రామ్ చరణ్ పాతిక లక్షలు గెలుచుకున్నాడని సమాచారం.

ఈ ఎపిసోడ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ గా తెరకెక్కించారు. తరువాతి ఎపిసోడ్లలో సామాన్య జనం ఈ కోటి రూపాయల కోసం పోటీ పడతారు. ఇప్పటికే 16 ఎపిసోడ్‌లు చిత్రీకరించనట్టు తెలుస్తుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ యొక్క ఉక్రెయిన్ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన ఎపిసోడ్లను చిత్రీకరిస్తారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss