Ram Gopal varma sensational comments on lockdown:
మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మంగళవారం లాక్డౌన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే కనిపిస్తే కాల్చివేయండి అనే ఆర్డర్స్ జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని వదిలి ఎవరైనా బయటికి వస్తే.. ఇక వారి పని అవుటే.
అయితే ప్రభుత్వాలు చేసిన ఈ ఆర్డర్స్‌పై పోలీసువారు హెచ్చరిస్తున్నట్లుగా రిథమింగ్ పదాలతో కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ రిథమింగ్ వర్డ్స్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోస్ట్ చేయడం విశేషం.
తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పోలీస్ హెచ్చరిక అంటూ పోస్ట్ చేసిన ఓ మెసేజ్ వైరల్ అవుతుంది. అదేమిటంటే.. ‘‘ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి.. ఒళ్ళంతా పచ్చడి కావాలంటే బయటికి రండి’’ అనే పోస్ట్‌కు నెటిజన్లు కూడా సెటైరికల్ వర్డ్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ ని కూడా అయన వదల్లేదు.