Sunday, January 24, 2021

Latest Posts

ట్రంప్ ని సైతం వదలని వర్మ

Ram gopal varma shocking comments on donald trump:

ఎప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను సైతం వదల్లేదు. భారత్ లో పర్యాటకు వచ్చిన ట్రంప్ కు కనీవినీ ఎరుగని స్థాయిలో మోడీ సర్కారు ఏర్పాట్లు చేయడంపై ట్విట్టర్ వేదికగా వర్మ వాగ్భాణాలు వదిలాడు. ట్రంప్ పర్యటన కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేయడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వివాదాలకు రాంగోపాల్ వర్మ ఆజ్యం పోస్తూ, సెటైర్లు వేశాడు.

Trump vs Varma

తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ టూరుపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ‘ట్రంప్ ను మనం ఇండియాకు ఆహ్వానించడానికి వేల కోట్లు ఖర్చు చేశాం. కానీ ప్రధాని మోడీని అమెరికాకు స్వాగతించడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు చేస్తారా? ’ అని వర్మ ప్రశ్నించాడు. అది అమెరికా, భారత్ కాదు అంటూ వర్మ పంచ్ వేసాడు.

ఇక మరో ట్వీట్ లో ట్రంప్ ఇండియాకు రావడానికి గల కారణాన్ని వర్మ ఎద్దేవా చేస్తూ,. ట్రంప్ తను వస్తే ఎంత మంది వస్తాడో చూద్దామని వచ్చాడని.. ట్రంప్ చనిపోయే వరకు దీన్ని గొప్పగా చెప్పుకుంటాడని పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్ నైట్ ను ట్రంప్ కోసం ఏర్పాటు చేయడంపై కూడా వర్మ సెటైర్ వేసాడు. మన సాంస్కృతిక కార్యక్రమాలు భారతీయులే చూడరని, ట్రంప్ ఎలా చూస్తాడంటూ ఎద్దేవా చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss