Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

మద్యం కోసం మహిళలు … ఆర్జీవీ ట్వీట్‌ కి సింగర్ సోనా ఫైర్

Ram Gopal Varma’s Tweet

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో దేశంలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే మద్యం అంశం (ఎక్సైజ్ శాఖ) అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి కొన్ని రాష్ట్రాలు మద్యం విక్రయాలకు మొగ్గు చూపగా మరికొన్ని రాష్ట్రాలు మద్యం విక్రయాలు మొదలుపెట్టాలా వద్దా అని ఆలోచన సాగించాయి. మొత్తానికి చాలా రాష్ట్రాలో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరమైన ప్రజలు మద్యం దుకాణాలు తెరవడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. దుకాణాలు తీయడానికి రెండు మూడు గంటల ముందే వరుసలో నిల్చున్నారు. కొందరైతే దుకాణాలకు పూజలు చేశారు. ఎండ తీవ్రంగా ఉన్నా ఖాతరు చేయకుండా కిలో మీటర్ మేర వరుసలో నిలబడ్డారు.

కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పట్టించుకోకుండా తోసుకున్నారు. కొన్నిచోట్ల పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక మద్యం విక్రయాల సందర్భంగా చిత్రవిచిత్ర సన్నివేశాలు జరిగాయి. అయితే మద్యం అంటేనే పురుషు లే కాదు,ఇప్పుడు మద్యం దుకాణాల వద్ద మహిళలు కూడా వరుసలో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొందరు యువతులు ఏకంగా మద్యం దుకాణం ఎదుట నిలబడి మద్యం కొనుగోలుకు చాలాసేపు వేచి ఉండడంతో అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారు. ఇన్నాళ్లు చాటున తాగేవాళ్లు లాక్డౌన్ పుణ్యాన బహిర్గతమైందని గుసగుస లాడుకున్నారు . అయితే కిలో మీటర్ మేర క్యూలు ఉండడంతో మహిళలు ఉంటే త్వరగా మందు లభిస్తుందనే ఆశతో వారి ఇంట్లోని మహిళలను రంగంలోకి దింపారు. దుకాణదారులు కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి వారికి త్వరగా మద్యం ఇచ్చి పంపించి వేయడమే కాకుండా సెపరేట్ క్యూ కూడా పెట్టడం విశేషం.

దీంతో చాలామంది తమ భార్యలు పిల్లలను మద్యం దుకాణాలకు పంపించి త్వరగా మద్యం లభించేలా ప్లాన్ వేశారు. ఇలాంటి దృశ్యాలు కర్నాటకలోని బెంగళూరు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం సిరిపురంలో యువతులు ముఖాలకు స్కాఫ్లు కట్టుకుని మద్యం దుకాణాలకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. మద్యం ధరలు పెంచినా వాటిని పట్టించుకోకుండా ప్రజలు తండోపతండాలుగా మద్యం దుకాణాలకు తరలివచ్చారు. గంటల కొద్దీ వరుసలో నిలబడి మద్యం కొనుక్కొని వెళ్లారు. త్వరగా మద్యం లభించాలని కొందరు మహిళలను పంపగా మరికొందరు దివ్యాంగులుగా నటించారు. మొత్తానికి కోట్లాది రూపాయల అమ్మకాలు సాగాయి.

కాగా ఓ మద్యం దుకాణం వద్ద క్యూలో మహిళలు నిలబడిన చిత్రాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తూ, ‘చూడండి క్యూలో ఎవరున్నారో. మహిళల్ని తాగుబోతు మగాళ్ల నుంచి కాపాడాలంటారు. మరి ఇదేంటి?’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై సింగర్ సోనా మోహపాత్ర మండిపడ్డారు. ఆర్జీవీ ట్వీట్‌లో సెక్సిజం తప్ప మరేంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మహిళలకు కూడా మగాళ్లలాగే మద్యం కొనుక్కునే హక్కుంది. కానీ మందు తాగి క్రూరమైన పనులు చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు’ అంటూ బదులిచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...