Thursday, December 2, 2021

Latest Posts

అయోధ్య రామయ్య దర్శనం ఎప్పుడంటే

Ram Temple in Ayodhya To Open For Devotees

ప్రస్తుతం అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. అలాగే 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కమిటి వర్గాలు చెబుతున్నారు. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌, పరిశోధనా కేంద్రం కూడా అందుబాటులోకి రానున్నాయి. ముందుగా 2024 లో పార్లమెంట్ ఎన్నికలకు ముందే అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని నివేదించబడింది. అలాగే ఆలయ స్థలంలో ఫౌండేషన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

అలాగే రామజన్ణం భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకారం, ఫౌండేషన్‌ పనుల్లో మూడు వేర్వేరు ప్రదేశాల నుంచి రాళ్లు ఉపయోగిస్తున్నారు. వీటిలో మీర్జాపూర్, రాజస్థాన్‌కు చెందినవి కూడా ఉండనున్నాయి. నేషనల్ జియో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గువాహటి నుంచి నిపుణులు ఆలయ నిర్మాణంలో సలహాలు ఇస్తున్నట్లు చంపత్‌ రాయ్‌ తెలిపారు. 2024 నాటికల్లా మొత్తం ఆలయం నిర్మాణ పనులు పూర్తిచేయాలని కన్‌స్ట్రక్షన్‌ కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఆలయ  నిర్మాణ పనులు 70 ఎకరాలకు బదులుగా 107 ఎకరాల్లో జరుగనున్నాయి. వసతుల సముదాయం, నివాస ప్రాంతం వంటి మరికొన్ని పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రైవేట్ యజమానుల నుంచి భూమి కొనుగోలు చేయనున్నారు. ఇటీవల ఆలయ ట్రస్ట్ రూ.1 కోటి చెల్లించి సమీపంలోని 7,285 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss