Monday, January 18, 2021

Latest Posts

కోదండ రాముని విగ్రహం ధ్వంసం

విజయనగరం జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం రాగా… విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. విగ్రహం ధ్వంసం చేశారని తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు ఆలయానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలంచారు. ఈ సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss