Monday, October 25, 2021

Latest Posts

మూవీ మోఘల్ దగ్గుబాటి రామానాయుడు జయంతి

దగ్గుబాటి రామానాయుడు, 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క, చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు.

రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.

ఇది కూడా చదవండి: వెంకీ  హౌస్  చూస్తే  దిమ్మతిరిగిపోద్ది….

2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు. అయితే దగ్గుబాటి రామా నాయుడు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన కుమారుడు దగ్గుబాటి సురేశ్ బాబు ప్రస్తుతం సురేశ్ ప్రొడక్షన్స్ భాద్యతలను భుజాన వేసుకున్నారు. రామా నాయుడు గారు ముందు చూపుతో ఆయన వేసిన అడుగుల కారణంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ అభివృద్ది చెందింది. కాగా అప్పట్లో చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలిన వారిలో రామా నాయిడు గారు ప్రధములు. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడే కలకాలం ఎదగాలని ఆయన మొట్ట మొదటగా తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చడం జరిగింది. తద్వారా ఫిల్మ్ నగర్ లో సినీ పరిశ్రమ ఎదగటానికి ఆయన తోడ్పాటు ఎంతగానో ఉంది. కాగా ఆయన 85 వ జయంతి సంధార్బంగా సినీ పెద్దలు నివాళులు అర్పించారు. కాగా ఫిల్మ్ నగర్ లోని ఆయన విగ్రహానికి ఆయన మనవడు నివాళి అర్పించి రామా నాయుడు గారిని తలచుకున్నారు.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss