Wednesday, April 21, 2021

Latest Posts

ముఖ్యమంత్రి పాత్రలో శివగామి

Ramya Krishna is Chief Minister in Sai Dharam Tej’s next movie:

హీరోయిన్ గా ఉండగా అగ్ర హీరోలందరి సరసన నటించి తన గ్లామర్ తో ఆడియన్స్ ని తనవైపునకు తిప్పుకున్న రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్మురేపుతోంది. సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాల్లో తన నటనతో గిలిగింతలు పెట్టిన ఈమె ఇక బాహుబలి మూవీలో తన విశ్వరూపం ప్రదర్శించింది. శివగామి పాత్రలో ఆమె నటనకు జనం జేజేలు పలికారు. ఎక్కడ చూసినా ఆమె నటనకే మార్కులు పడ్డాయి.

కాగా ‘క్వీన్‌’ వెబ్‌ సిరీస్‌లో దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించి రమ్యకృష్ణ మెప్పించింది. అయితే మరోసారి ఆమె ముఖ్యమంత్రి కనిపించ బోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. సాయితేజ్‌ హీరోగా, నివేధా పేతురాజ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్‌, పుల్లారావు నిర్మిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో తేజ్‌ డాక్టర్‌గా, రమ్యకృష్ణ శక్తిమంతమైన ముఖ్యమంత్రిగా నటిస్తు న్నట్లు టాక్. ఏలూరులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంద ని అంటున్నారు. అయితే సీఎం పాత్రకోసం మొదట లేడీ అమితాబ్ విజయశాంతిని సంప్రదించారట. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో ఇక రమ్యకృష్ణను ఎంపిక చేయాలనీ భావించడం,ఆమె ఒకే చెప్పడం జరిగినట్లు చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss