Tuesday, April 13, 2021

Latest Posts

రానా సక్సెస్ సీక్రెట్ చెప్పిన సురేష్ బాబు

Rana Daggubati shares his thoughts on his success career :

“రానా” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత పరిచయం అవసరం లేని పేరు. బల్లాలదేవగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ఈ ఆరడుగుల తెలుగు నట వారసుని ఫిలిం కెరీర్ మొదలుపెట్టి పది సంవత్సరాలు అయినా సందర్బంగా సురేష్ ప్రొడక్షన్స్ రానా ఇప్పటి వరకు తన సినీ జీవితాన్ని వీడియో రూపంలో అందిస్తుంది. రానా మాట్లాడుతూ “మనం మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆ సమయంలో నా మొదటి సినిమా తీసిన శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయి. నేను ఆయన నుంచి చాల నేర్చుకున్నాను. తరువాత నేను నటించిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నేను నా రాక్షసి, నా ఇష్టం, రాంగోపాల్ వర్మ డిపార్ట్మెంట్ ఈ మూడు సినిమాలు డిసాస్టర్ అయ్యాయి. ఈ ఓటములన్ని నాకు పాఠాల్ని నేర్పాయి, ఫెయిల్యూర్ నాకు గొప్ప టీచర్.

నేను వారసత్వం ద్వారా సినిమాలలోకి వచ్చాను అనే వాళ్లందరికీ నేను చెప్పే సమాధానం, మన తండ్రికి కెమికల్ ఫ్యాక్టరీ ఉంటె, మనకు ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఎలా రన్ అవుతుందో ఒక అవగాహన వస్తుంది, అలాగే సినిమా అనేది మా లైఫ్ స్టైల్ కాదు మాకు ఇదే లైఫ్. మేము అంత ఈజీ గ సినిమాలు తియ్యట్లేదు దాని వెనుక ఒక జీవిత కష్టం ఉంటుంది. నాతో “రానా నీకు మొదటి సినిమా ఒక బూస్ట్ ఇవ్వడానికి ని బ్యాక్ రౌండ్ పనిచేస్తుంది, కానీ ప్రేక్షకులు మాత్రం నీలో ఏం ఉందొ అది బయటకు తీసి చూస్తారు” అని అన్న చిరంజీవి గారు చెప్పిన మాటలు…  నా తండ్రి సురేష్ బాబు “అందరు చాల క్లియర్ గ ఉన్న రూట్ లో వెళ్ళడానికి ప్రయత్నిస్తారని కానీ రానా డిఫరెంట్ వేలో వెళ్తుండడం ఆశ్చర్యంగా ఉంది అని చెప్పిన మాటలు.  గుర్తు చేసుకుంటూ ఈ ఆలోచనలతో నాకు ఏం చెయ్యాలో అర్ధం అయ్యింది అని అందుకే కృష్ణం వన్డే జగద్గురుమ్ అనే మూవీ చేసానని దాని నుంచి బాహుబలి అవకాశం వచ్చింది” తెలియచేసారు. కాగా బాహుబలి ఎంత ఘానా విజయం అయ్యిందో ఇక వేరేగ చెప్పాల్సిన పని లేదు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss