Monday, May 10, 2021

Latest Posts

పాన్ ఇండియా చిత్రానికి సంతకం చేసిన రానా

Rana Pan India Film
రానా దగ్గుబాటి తన తదుపరి చిత్రంకు సంతకం చేశారు. సీనియర్‌ నిర్మాత ఆచంట గోపినాథ్ కథ రానాను ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు.

ఈ చిత్రం సరికొత్తగా ఉంటుందని ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం రానా విరాటపర్వం విడుదల కోసం ఎదురుచూచూస్తున్నాడు. అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తున్నాడు రానా. ఈ సినిమా పూర్తవ్వగానే రానా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభిస్తాడు. చిత్ర దర్శకుడు మరియు ఇతర తారాగణం మరియు సాంకేతిక నిపుణుల గురించి ఇంకా వివరాలను వెల్లడించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss