Monday, October 25, 2021

Latest Posts

హీరో హీరోయిన్ల పెళ్లి మరో సారి వాయిదా

Ranbir Kapoor Alia Bhatt Marriage

బాలీవుడ్ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్,ఆలియా భట్‌ల పెళ్లికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం తప్పట్లేదు. మూడేళ్ల ముందే వీరి పెళ్లి జరగాల్సింది. కానీ రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడటంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆయన కోలుకుని మామూలు మనిషయ్యాక వీరి పెళ్లి చేద్దామనుకున్నారు. రిషి విదేశాల్లో చికిత్స చేయించుకుని ముంబయికి తిరిగొచ్చారు.

ఆయన కొంచెం కుదురుకున్నాక పెళ్లి అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చింది. లాక్ డౌన్ టైంలో రిషి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు. దీంతో రణబీర్-ఆలియాల పెళ్లి ఆగిపోయింది. ఇక అన్ని సర్దుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే రణబీర్, ఆలియా ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడ్డారు.

దీనితో మరో సారి పెళ్లి వాయిదా పడింది. ఇక ఈ మధ్యలో పరిస్థితులు కుదురుకునే అవకాశం కనిపించకపోవడంతో పెళ్లిని 2022లో చేసుకోవాలని నిశ్చయించుకున్నారట. ప్రస్తుతం ఇద్దరూ కరోనా నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆలియా చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు గంగూబాయి కతియావాడీ, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss