Sunday, June 20, 2021

Latest Posts

మంచి వసూళ్లతో దూసుకుపోతున్న రంగ్ దే

Rang De Box Office Collection

నితిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగ్ దే కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్ మనసులను కూడా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. కరోనా భయం ఉన్నప్పటికీ ఈ చిత్రం బారీ బిజినెస్ చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నిర్మాతల ప్రకారం, రంగ్ దే నాలుగు రోజుల వ్యవధిలో ఎపి మరియు టిఎస్ లలో 12.46 కోట్ల షేర్ ను సాధించింది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన రంగ్ దే మొదటి వారంలోనే లాభాల జోన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రికవరీ ఇప్పటివరకు 70 శాతం అయ్యినట్లు సమాచారం. మరోవైపు, బయ్యర్లకు కూడా ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది.

రంగ్ దే నాలుగు రోజుల కలెక్షన్లు:
నైజాం: 4.69 Cr
సీడెడ్ : 2.10 Cr
వైజాగ్ : 1.58 Cr
గుంటూరు : 1.25 Cr
తూర్పు : 0.97 Cr
వెస్ట్ : 0.65 Cr
కృష్ణ : 0.72 Cr
నెల్లూరు : 0.50 Cr

మొత్తం : 12.46 Cr

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss