Sunday, June 13, 2021

Latest Posts

ఘోరంగా పడిపోయిన రంగ్ దే కలెక్షన్లు

Rang De Box Office Collection
నితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26 న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ రోజుతో ఈ సినిమా థియేటర్స వద్ద ఒక వారం పూర్తి చేసుకుంది. అయితే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కాస్త చతికలబడింది.

‘రంగ్ దే’ నితిన్ ముందు చిత్రం ‘చెక్’ కంటే మెరుగైన రివ్యూలను గెలుచుకుంది. కానీ ఈ రొమాంటిక్ డ్రామా మొదటి వారాంతం తర్వాత అదే వేగాన్ని కొనసాగించలేకపోయింది. వారం రోజుల్లో సినిమా బృందం ఊహించిన దాని కంటే కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి. మొదటి వారం చివరి నాటికి, ‘రంగ్ దే’ తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 11 కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే సంపాదించింది.

రానా యొక్క ‘ఆరణ్య’ మరియు ‘తెల్లావారితే గురువారం’తో పోటీగా వచ్చిన ఈ చిత్రం విన్నర్ గా నిలిచినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల సినిమా థియేట్రికల్ వ్యాపారం కూడా దెబ్బ తిన్నట్లుగా తెలుస్తుంది. ‘రంగ్ దే’ ను నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకి అట్లూరి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss