Monday, July 26, 2021

Latest Posts

రాధే శ్యామ్ నిర్మాత పై లైంగిక వేధింపులు కేసు నమోదు

Rape Case Filed On Bhushan Kumar

30 ఏళ్ల మోడల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అంధేరిలోని డిఎన్ నగర్ పోలీసులు రాధే శ్యామ్ నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్, సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి తన పై అత్యాచారం చేశాడని తెలిపింది.

2017 ఆగస్టు నుండి భూషణ్ కుమార్ తనకు తెలుసునని మోడల్ చెప్పింది. 2017 మరియు 2020 మధ్య ఈ ప్రముఖ సినీ నిర్మాత ఆమె పై లైంగికంగా దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే భూషణ్ కుమార్‌పై కేసు నమోదయినప్పటికీ పోలీసులు అతనిని ఇంకా అరెస్టు చేయలేదు.

మరొక వైపు, రాధే శ్యామ్ నిర్మాత భూషణ్ కుమార్ స్పందిస్తూ ఇలా తెలిపారు. తన పై దాఖలు చేసిన ఫిర్యాదు పూర్తిగా అబద్ధం. తను ఛాన్స్ ఇచ్చే నెపంతో ఆమె ను వాడుకోలేదని అతను తెలిపాడు. ఆమె టి-సిరీస్ బ్యానర్ కోసం ఫిల్మ్, మ్యూజిక్ వీడియోలలో నటించన విషయాన్ని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss