ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట అయితే ఈ యాప్ ద్వారా చాలా మంది స్టార్లుగా కూడా మారిపోయారు. ఇక ఇప్పుడు అయితే ఇంకా చేపనక్కరలేదు లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు సైతం ‘టిక్‌టాక్’లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అవి ఇవి అని కాకుండా వాటితో పాటు ఫన్నీ వీడియోలతో పాటు కరోనాపై జాగ్రత్తలు చెబుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అసలు విషయం వస్తే హిందీ’ బిగ్‌బాస్ 13′ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్ ఇటీవల టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె వచ్చిన ఒక్క రోజులోనే భారీ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
మే 7న ఈ బ్యూటీ టిక్‌టాక్‌లోకి రాగా ఒక్క రోజులోనే 4 మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.దానితో ఆమెకు ఉన్న క్రేజ్ మరోసారి బయటపడింది. అలా గతేడాది జరిగిన బిగ్‌బాస్ 13లో పాల్గొనడంతో రష్మీ బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా రష్మీ, అర్హన్ ఖాన్ లవ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే బిగ్‌బాస్ 13 విజేత అయిన సిద్ధార్థ్ శుక్లాకు చివరి వరకు రష్మీ దేశాయ్ గట్టి పోటీని ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: కొత్త అప్డేట్ ను తీసుకొచ్చిన పబ్ జి.. మ్యాప్‌కు భారీ మార్పులు …!!