Thursday, May 13, 2021

Latest Posts

ఆ సినిమా లో నటించి వుండకూడదు :రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్..!!

rashi khanna shocking comments on World famous lover movie

తెలుగు తెరపై అందాల కథానాయికగా రాశి ఖన్నాకి మంచి క్రేజ్ వుందనే చెప్పాలి. కెరియర్ విషయంలో ఆమె ఆచి తూచి వ్యవహరిచే రాశి కి వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం పెద్ద షాక్ ఇచ్చింది.  బోల్డ్ రోల్స్ చేస్తే ఇంకా ఎక్కువ ప్టూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పుకొచ్చిన రాశీ. ఇప్పుడు మాట మార్చేస్తుంది. విషయం ఏమిటంటే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో రాశీ ఖన్నా కు విజయ్ కు హాట్ బెడ్ సీన్స్ ఉంటాయి.

విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి లిప్ లాక్ లకు కూడా లోటు ఉండవు. ఇక ఈమె ఇంత రిస్క్ చేసినా ఆ పాత్రకి ఎలాంటి గుర్తింపు రాకపోవడం నిరాశను కలిగించే విషయమే. ఆ సినిమా విజయవంతం కాకపోవడం ఆమెను మరింత డీలాపడేలా చేసింది. ఆ పాత్రను గురించి తాజాగా రాశి ఖన్నా స్పందిస్తూ ..”ఆ సీన్ లు ఇష్టం లేకుండానే చేశాను. విజయ్ ముందుగానే చెప్పాడు.. ‘నాకు ఆల్రెడీ ఆ ఇమేజ్ ఉంది… నీకు అలాంటి ఇమేజ్ లేదు కదా ఆలోచించుకో అని’ కానీ నేను అప్పుడు అర్ధం చేసుకోలేకపోయాను. సినిమా రిలీజ్ అయ్యాక చాలా బాద పడ్డాను.  ఇక అలాంటి పాత్రలను చేయకూడదనీ, గ్లామర్ పరంగా హద్దులు దాటని పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss