Monday, January 18, 2021

Latest Posts

మార్పు మన నుంచి మొదలు కావాలి రష్మీ

యాంక‌ర్ ర‌ష్మికి మూగ జీవాలంటే ఎంత ప్రేమో మనందరికీ తెలిసిందే. మూగ జీవాల‌ పట్ల ఆమె చూపే జాలి, వాటికి హాని జరిగితే ఆమె చెందే ఆవేదన అంతా ఇంతా కాదు. నోరులేని జీవాలను రక్షించండి, దయచేసి వాటికి హాని తలపెట్టకండి అని ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించింది రష్మీ. లాక్‌డౌన్ వేళ వీధి కుక్కలకు ఆహారం పెట్టి అందరిచేత భేష్ అనిపించించుకున్న ఆమె.. జంతువులపై ప్రేమ చూపించాలంటూ గొప్ప అవేర్‌నెస్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఏనుగు ఫొటో‌ను షేర్ చేస్తూ మన సరదా కోసం ఏనుగులను హింసించ‌డం స‌రికాద‌ని చెప్పింది. మ‌నం స‌ర‌దా కోసం ఏనుగుపై ఎక్కి దానిపై తిర‌గ‌డం వ‌ల్ల దానికి హాని చేసిన వాళ్ళం అవుతున్నామని, దయచేసి అలాంటి సరదాలకు దూరంగా ఉండి వాటిని బాధ పెట్టకుండా ఉండండి అని రష్మీ పేర్కొంది. ”టూరిస్ట్ రైడ్స్‌లో మూగ జీవులపై ప్రయాణాలకు నో చెప్పండి” అని ఆమె పోస్ట్ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

ఈ మేరకు గాయపడిన ఏనుగు ఫొటోను చూపిస్తూ.. మనం ఏనుగు పై ఎక్కి తిర‌గ‌డం వ‌ల్ల దానికి ఎలాంటి గాయాల‌వుతాయ‌న్నాయనేది వివరించింది. త‌న మాట విన‌డానికి మావ‌టివాడు ఏనుగును ఇలా గాయ‌ప‌ర్చుతాడ‌ని, కాబట్టి మన సరదా కోసం ఏనుగు ఎక్కడం మానుకోవాలని తెలుపుతూ ఎమోషనల్ అయింది రష్మీ. ఈ సమాజంలో మ‌నం కోరుకునే మార్పు మ‌న నుంచే మొదలు కావాలని ఆమె పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss