Rashmika comments on chiken at NECC Chicken and Egg Mela in Hyderabad:
చికెన్ తింటే ఏమి కాదు అంటున్న- రష్మిక మందన్న
భీష్మ సినిమాతో హిట్ పరంపరను కొనసాగిస్తున్న హీరోయిన్ రష్మిక మందాన. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండతో కలిసి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. వరుస విజయాలతో తన కెరీర్ ను ఏ ఢోఖా లేకుండా కొనసాగిస్తుంది. సరి లేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్, ఆ సినిమా హిట్ తర్వాత భీష్మ సినిమాలో నితిన్ తో పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు టాప్ హీరోయిన్ లిస్ట్ లో కొనసాగుతున్న ఈ హీరోయిన్ అల్లు అర్జున్ మూవీ లో నటిస్తుంది.
కాగా ప్రపంచంలో అందరిని వణికిస్తున్న కరోనా వైరస్ చికెన్ తింటే వస్తుంది అనే అపోహల్ని తెర దించడానికి, తెలంగాణ మంత్రులు, పౌల్ట్రీ రైతులు, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీతో కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఒప్లెస్ ప్లాజాలో “చికెన్-ఎగ్ మేళా” కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి రష్మిక మందన్నని పిలవగా… తన మేనేజర్ మూడు పూటల చికెన్ తింటాడు, ఆయనకు ఎం కాలేదు కాబట్టి మీకు కూడా ఏం కాదు అని వివరణ ఇచ్చింది. అందుకె మీరు కూడా చికెన్ తినండి అని చెప్పింది. ఇది ఇలా ఉండగా..కరోనా ఎఫెక్ట్ వల్ల భారీగా చికెన్ ధరలు పడిపోయాయి. చికెన్ ఒక కేజీ కేవలం 75 రూపాయలు మాత్రమే, ప్రజలు కూడా తినటం మానేశారు కనుక అవగాహనా కార్యక్రమంగా ‘చికెన్ ఎగ్ మేళా’ ను చేసినట్టు తెలిపారు.