Monday, July 26, 2021

Latest Posts

కాజల్ అగర్వాల్, సమంతా ని దాటేసిన రష్మిక

Rashmika Mandanna Beats Kajal Aggarwal Samantha

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య బాగానే ఉంది మరియు ఆమె పోస్టులు తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 19.2 మిలియన్లకు చేరుకుంది. ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈమె అభిమానుల సంఖ్యలో సమంతా , కాజల్ అగర్వాల్ ని దాటేసింది. రష్మికకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 19.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, సమంతా అక్కినేనికి 17.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అలానే కాజల్ కు 19 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ దాటుకుని ముందడుగు వేసింది రష్మిక.

రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్‌లో, ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో పనిచేస్తోంది, ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss