Rashmika Mandanna Car Price
విలాసవంతమైన రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేసిన హీరోయిన్ల లిస్ట్‌లో రష్మిక మందన్న చేరింది. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తెలిపింది. ఈ క్షణం గురించి ప్రగల్భాలు పలకడం ఇష్టం లేదని ఆమె అన్నారు. అయినప్పటికీ, ఆమె తన కొత్త కారు చిత్రాన్ని సోషల్ మీడియాలో మనతో షేర్ చేసుకుంది.
ఆమె షేర్ చేస్తూ ఇలా పోస్ట్ చేసింది, “నేను ఎక్కువగా / సాధారణంగా ఇలాంటివి నా వద్ద ఉంచుకుంటాను .. కానీ ఈసారి నేను మీతో పంచుకోవాలనుకున్నాను ఎందుకంటే మీరు ఈ ప్రయాణంలో భాగం… మరియు మీరు దానిని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను… నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇది మీ కోసం. ” అయితే ఇంతకీ ఈ కారు విలువ ఎంత ఉంటుందనుకుంటున్నారు? రూ. కోటి రూపాయల పైనే!.
తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన ఈమెకు ఈ మొత్తం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్న సుకుమార్ – అల్లు అర్జున్ తీస్తున్న ‘పుష్ప’ లో మెయిన్ లీడ్ గా చేస్తుంది.
ఇవి కూడా చదవండి: