హీరో హీరోయిన్స్ కి ఫాన్స్ ఉన్నట్లే ,నటీనటులకు కూడా అభిమాన హీరోలు,హీరోయిన్స్ కూడా ఉంటారు. ఇక వరుస హిట్ మూవీస్ తో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ రష్మికా మందన్నా కి కూడా ఫేవరేట్ హీరో ఉన్నాడట. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకు న్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీతో మరో హిట్ అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆడిపాడి,స్టెప్పులతో అదరగొట్టేసింది.
తమిళ హీరో విజయ్ నటించిన `బిగిల్` సినిమాలో రష్మిక హీరోయిన్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కుదరలేదు. టాలీవుడ్లో ఆమె ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. నితిన్ సరసన రష్మిక నటించిన `భీష్మ` సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపదంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో గురించి రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
`చిన్నప్పటి నుంచి నేను తమిళ హీరో విజయ్‌కు వీరాభిమానిని. విజయ్ నా చైల్డ్‌హుడ్ క్రష్. ఇప్పటికీ ఆయనంటే అంతే ఇష్టం. ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా` అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక చెప్పిన ఈ విషయాన్ని విజయ్ అభిమానులు ఊరుకుంటారా ? అందుకే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా త్వరలో తన అభిమాన హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.