Monday, July 26, 2021

Latest Posts

అభిమాని కోసం బాధపడ్డ రష్మిక మందన్న

Rashmika Mandanna Fan Travel 900 Kms To Meet Her

హీరోయిన్లకు అభిమానులు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కన్నడ బ్యూటి రష్మిక మందన్న అభిమాని ఆమెను చూడటానికి కర్ణాటకలోని తన ఇంటికి 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాడు. అయితే రష్మిక ముంబైలో హిందీ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నందున ఆ అభిమానిని కలవడానికి రాలేదు.

దీనితో ఈ విషయం తెలుసుకున్న రష్మిక వెంటనే సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె ఏం చెప్పిందంటే, ఒక అభిమానిని కలవలేకపోవడం చాలా బాధించింది. మీరు నా కోసం 900 కిలోమీటర్లు ప్రయాణించారని తెలిసింది. కరోనా సమయంలో ఇలాంటి పనులు చేయకండి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను ఆశిస్తున్నాను కాని అప్పటి వరకు నా పై ప్రేమను చూపించు అంటూ ఆమె తెలిపింది.

ప్రస్తుతం రష్మిక మందన్న మిషన్ మజ్ను, గుడ్బై వంటి చిత్రాలతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. టాలీవుడ్‌లో ఆమె సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో హీరోయిన్గా నటిస్తోంది, ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss