Sunday, June 20, 2021

Latest Posts

ఆ ఇంటి కోడలు కావాలనుకుంటున్న రష్మిక మందన్న

Rashmika Mandanna Interesting Comments
భారతదేశంలో అనేక భాషల్లో, అనేక చిత్రాలు చేస్తూ నేషనల్ క్రష్ గా ఎదిగిన భామ రష్మిక మందన్నా. నాగ శౌర్య నటించిన చలోతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామకి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం లభించింది. ఇటీవల కార్తీ నటించిన యాక్షన్ డ్రామా సుల్తాన్‌తో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.

అంతే కాకుండా ఇప్పుడు ఈ కన్నడ భామ బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిస్సన్ మజ్ను లో నటిస్తుంది. ఇంకా అనేక తెలుగు, తమిళ మరియు హిందీ భాషల సినిమాలకు కూడా ఈమె సంతకం చేసింది. అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె ఎవరింటి కోడలు కావాలనుకుంటుందో చెప్పింది.

అవునండి ఇది నిజం. ఆమెనే చెప్పింది. అది ఎవరంటే ఆమె తమిళ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఆహారం పట్ల ప్రేమలో పడ్డానని, తమిళుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని ఇటీవల రష్మిక వెల్లడించారు. నాకు తమిళింటి కోడలు కావాలని ఉందని చెప్పింది. మరి రష్మికాను వివాహం చేసుకోబోయే ఆ లక్కీ తమిళ వ్యక్తి ఎవరో వేచి చూడాలి. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్పలో అల్లు అర్జున్ ను రొమాన్స్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss