Monday, May 10, 2021

Latest Posts

ఫాన్స్ ఫీలయ్యేలా రష్మిక ఏంచేసిందో తెలుసా

Rashmika mandanna knows what caused the fans to fail

ఇప్పుడు టాలీవుడ్ లో  పూజా హెగ్డే,  రష్మిక మందన ఒకరికొకరు పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. ఇందులో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కష్టం అంతలా వీళ్ళ మధ్య పోటీ ఉంది. ఇక  ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి  మరింత దగ్గరైంది. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. తాజాగా నితిన్‌తో భీష్మలో నటించి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.

అయితే  నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా జెర్సీ  ఇప్పుడు  హిందీలో భారీ స్థాయిలోనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా  రీమేక్ అవుతోంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక మందన  అయితే బావుంటుందని  మూవీ యూనిట్ భావించి,  ఆమెను సంప్రదిస్తే, ఆ ఆఫర్‌ను రష్మిక తిరస్కరించింది. అయితే షాహిద్ కపూర్ లాంటి స్టార్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే రష్మిక కెరీర్ ఇక ఓ రేంజ్‌లో ఉండేదని అది ఆమెకు ఎంతో ఉపయోగపడేదని అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఆమె ఫాన్స్ తెగ ఫీలవుతున్నారట.

వచ్చిన  బాలీవుడ్ ఆఫర్‌ను అంగీకరిస్తే హిందీలో కూడా బిజీ అయ్యేదని, బంగారంలాంటీ అవకాశాన్ని రష్మిక మిస్ చేసుకుందని  ఆమె ఫ్యాన్స్  బాధ పడిపోతున్నారట.  కాగా మెగాస్టార్   చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల  శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. రష్మిక ఇందులో  చరణ్ సరసన మెరవనుంది. అలాగే రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమా కి  సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss