Sunday, June 20, 2021

Latest Posts

డేటింగ్ అంటే ఏం చేయాలి అని అడుగుతున్న హీరోయిన్

Rashmika Mandanna Reaction On dating

ఇప్పుడు హీరోయిన్స్ లో డేటింగ్ అనేది సాధారణ విషయంగా మారిపోయింది. చాలా మంది టాలీవుడ్ హీరోయిన్లు డేటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న రష్మికకు మాత్రం అసలు డేటింగ్ అంటే ఏంటో తెలియదంట. ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే ఏం చేయాలో అని అడుగుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఇంకా రష్మిక ఏమందంటే, ” డేటింగ్ అంటే నాకు తెలియదు. అసలు డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా నాకు అర్థం కాదు. నా వరకు నేనైతే డేటింగ్ కంటే ఎడ్వెంచరస్ స్పోర్ట్స్ కు వెళ్లడానికి ఇష్టపడతాను. ఇక వర్చువల్ డేటింగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.”

అయితే ఈ ముద్దుగుమ్మ ఓ యంగ్ హీరోతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలానే ఈ ముద్దుగుమ్మ కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి తో కలిసి చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటింగ్ పై రష్మిక ఇలా రియాక్ట్ అవ్వడం కాస్త హాస్యాస్పదంగానే ఉంది.

ఇక తన గ్లామర్ డోస్ పెరగడానికి కారణం కరోనా అట. “ఈ కొవిడ్ టైమ్ లో ఎక్కువగా ఇంట్లోనే ఉన్నాను. దీంతో ముఖానికి మేకప్ వేయాల్సిన అవసరం రాలేదు. మేకప్ ఎప్పుడైతే వేయకుండా ఉంటామో ఆటోమేటిగ్గా నిగారింపు వస్తుంది. అలా నా గ్లామర్ పెరిగింది.” అంటూ చెప్పుకొచ్చింది ఈ పుష్ప హీరోయిన్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss