Sunday, June 20, 2021

Latest Posts

ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన రష్మిక మందన్నా

Rashmika Mandanna Speech

కార్తీ, రష్మిక జంటగా నటించిన ‘సుల్తాన్’ మూవీ రేపు ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది రష్మిక.

అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ‘చాలారోజుల తరువాత మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఇంతకీ కరోనా ఎలా ఉంది.. కరోనా బాగుందా?? మీరు ఎలా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారా?? నాకేం కనిపించడం లేదు.. మాస్క్‌లు పెట్టుకుంటున్నట్టుగా కనిపించడం లేదు.. మాస్క్‌లు ఎక్కడ పెట్టుకుంటున్నారు.. నాకేం కనిపించడం లేదే.. సర్లే అందరూ కేర్ ఫుల్‌గా ఉండండి.. బట్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి.’

నన్ను హీరో కార్తీ చెన్నైలో బాగా చూసుకున్నారు.. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి బాగా చూస్కోండి. మన హైదరాబాద్ అని మంచి హైప్ ఇచ్చా.. బాగా చూస్కోండి. ఏప్రిల్ 2న సుల్తాన్ సినిమా రాబోతుంది. తమిళ్‌లో నా డెబ్యూ ఫిల్మ్ కాబట్టి.. కాస్త టెన్షన్‌గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది?? టీజర్, ట్రైలర్‌లు చూస్తుంటే.. ఏదైనా మాట్లాడండి అంటూ అభిమానుల్ని రెచ్చగొట్టేసింది రష్మిక.

ఇక అభిమానులు సూర్య, కార్తీ అని గట్టిగా అరుస్తూ రష్మికను మాట్లాడకుండా చేశారు. దీంతో ఆమె కూడా సూర్య.. కార్తీ అని అరుస్తూ.. చుప్.. ఆపండెహే నన్ను మాట్లాడనీయండి.. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది.. ప్లీజ్ రా మాట్లాడనీయండ్రా అని మళ్లీ స్పీచ్ మొదలుపెట్టింది రష్మిక.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన వంశీ పైడిపల్లికి కంగ్రాట్స్ చెప్పింది రష్మిక. నాకు పార్టీ కావాలి.. ‘మహర్షి’ సినిమాకి నేషనల్ అవార్డ్ రావడంతో వంశీ అన్నా.. పార్టీ కావాలి నాకు అని అడిగింది రష్మిక. ఈ సినిమా హిట్ అయితే నా బర్త్ డే గిఫ్ట్ మీకు అదే అంటూ స్టేజ్‌పై ఓవర్‌గా రియాక్ట్‌ అవుతూ అత్యుత్సాహం చూపించింది రష్మిక.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss