Home రాజకీయం ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు

ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు

ఏ. పి ప్రభుత్వం రాష్ట్రం లోని  పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందిచేలా సరికొత్త నూతన  విధానాన్ని అధికారులు రూపొందించగా దానికి  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు  నుంచి ఆమోదముద్ర వచ్చేసింది.  అలాగే ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే రేషన్ కార్డులను జారీ చేసే విధానాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్నదట.

అట్లాగే రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా సుమారుగా  ప్రతీ ఇంటికి 10,15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనున్నారు.దీనికోసం  ఒక్కో సంచీ తయారీకి రూ. 25  ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.

ఇది కూడా చదవండి

 

Exit mobile version