టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో గా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ లలో ఒకరిగా ఉన్న మాస్ మహా రాజ్ రవితేజ ఇప్పుడు హిట్ కోసం చూస్తున్నారు. మొన్న రాజ ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవి తేజ తరువాత అటువంటి హిట్ మళ్ళీ కొట్టలేదు. మద్య మద్య లో కొన్ని సినిమాలు ట్రై చేసినా అవి అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు మాత్రం కొత్త డైరెక్టర్ తో హిట్ ఇవ్వాలని ఆశ పడుతున్నారు.
గోపి చంద్ మలినేని సినిమా “క్రాక్” తర్వాత రమేశ్ వర్మ దర్శ్కత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు కాగా వీరిలో నభ నటేశ్, నిధి అగర్వాల్, పాయల్ రాజ్ పుత్ కావడం విశేషం కాగా ఎలా కొత్త హెరోయిన్ లకు ఛాన్స్ ఇచ్చిన రవితేజ తమన్నాతో నో చెప్పించుకున్నారు. త్రినడ రావు నక్కిన, రవి తేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో తమన్నాను అడిగితే భారీగా రెమ్యూనరేషన్ అడిగిందని అందుకే ఇలా కొత్త భామలను తీసుకుంటున్నారని సినీ వర్గాలలో టాక్.
ఇది కూడా చదవండి: తమిళనాట పై కన్నేసిన పూజ హెగ్డే ?