rbi governor shaktikanta das key comments on financial crisis
లాక్ డౌన్ పొడిగుంపు దృష్ట్యా దేశ ఆర్ధిక పరిస్థితి గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రధానంగా లాక్‌డైన్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని అందువల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
లాక్ డౌన్ వల్ల దేశం సంక్షోభంలో పడిందని దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు 50వేల కోట్లతో విడుదల చేస్తునట్లు దీంతో ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు నాబార్డ్, సిడ్బీ, ఎన్‌హెచ్‌బీ వంటి ఆర్థిక సంస్థలకు రుణాల రూపంలో అందజేస్తునట్లు తెలిపారు. అలాగే రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తాగించినట్లు తెలిపింది దాంతో ప్రస్తుతం 4 శాతం ఉన్న రివర్స్ రెపో రేటు ఇప్పుడు 3.75 శాతానికి వస్తుందని తెలిపారు. రుణ లభ్యత వీలైనంత ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటునట్లు తద్వారా ఆర్థిక భద్రత మరియు మార్కెట్లలో పనులు కార్యకలాపాలు పుంజుకునేలా తగిన చేర్యాలు తీసుకుంటునట్లు తెలిపారు.
కరోనావల్ల చాలా ఆర్ధిక సంక్షోభం ఉన్నా , అన్నీ కార్యకలాపాలు సాగించేందుకు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు చొరవ చూపాలని, ఇంత కష్ట కాలంలో కూడా బ్యాంక్ సిబ్బంది వారి విధులను నిర్వహించి నందుకు ఈ సందర్బంగా వారిని అభినందించారు. దేశంలో లాక్ డౌన్ అమలవుతునందున ఇంర్నెట్, మొబైల్ బ్యాకింగ్ డౌన్‌టైమ్ లేదని బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. మార్చిలో వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి నట్లు, విద్యుత్ డిమాండ్ భారీగా క్షీణించిందని, ద్రవ్య లభ్యత సరిపడా ఉండేలా చూసేందుకు, రుణ మంజూరు సజావుగా సాగేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు త్వరలో మరి కొన్ని చర్యలు తీసుకొనునట్లు తెలిపారు.