RBI lost its patience and decided to seize Yes Bank:
యస్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మారటోరియం విధించింది. బోర్డు ని సస్పెండ్ చేసింది . అయితే వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రాణా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ బ్యాంకు లో ఈవిధంగా దారి తీసిన పరిస్థితుల గురించి తనకు తెలియద న్నారు. గడచిన 13 నెలల నుంచి బ్యాంకుతో ఏ విధంగానూ తనకు సంబంధం లేదని, అందువల్ల తనకేమీ తెలియదని తేల్చేసారు. యస్ బ్యాంకుకు చోదక శక్తిగా వ్యవహరించిన రాణా కపూర్ ఈ బ్యాంకులో తన చివరి స్టేక్‌ను 2019 నవంబరులో అమ్మేశారు. అదే సమయంలో ప్రమోటర్లు యస్ కేపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా తమ తమ వాటాలను అమ్మేశాయి.
రానా కపూర్ , ఆయన గ్రూప్ సంస్థలు అంతకుముందు యస్ బ్యాంక్‌లోని రూ.510 కోట్ల విలువైన 2.16 శాతం వాటాలను బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశాయి. అదే నెలలో అమ్మేసిన 1.8 శాతం వాటాలకు ఇది అదనమని చెప్పాలి.
రాణా కపూర్ యస్ బ్యాంక్‌ను రూ.3.4 లక్షల కోట్ల బుక్ వాల్యూకు ఒక దశాబ్దంలోనే అభివృద్ధి చేశారు. అయితే బ్యాంకు రుణాలు విపరీతంగా పెరగడంతో నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. యస్ బ్యాంకు బోర్డును సస్పెండ్ చేసిన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంకు పునరుద్ధరణకు ఓ పథకాన్ని శుక్రవారం ప్రకటించింది.
మారటోరియం విధించిన 24 గంటల తర్వాత ప్రకటించిన ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ప్రకారం, యస్ బ్యాంక్ ఆథరైజ్డ్ కేపిటల్ రూ.5,000 కోట్లుగా మార్పు చేసారు. ఈక్విటీ వాటాల సంఖ్యను రూ.2 ముఖ విలువతో 2,400 కోట్లకు కుదించారు. .రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు ఇన్వెస్టర్ బ్యాంక్‌కు ఉంటాయి. ఈ స్టేక్‌ను రూ.10కి తక్కువ కాకుండా సేకరిస్తుంది. అటువంటి ఇన్వెస్టర్లకు మూడేళ్ళ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. వారు తమ హోల్డింగ్‌ను 26 శాతం కన్నా తక్కువకు తగ్గించరు. ఇన్వెస్టర్ బ్యాంక్ (భారతీయ స్టేట్ బ్యాంక్) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నియమించవచ్చు.
రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్లను ఆర్బీఐ నియమించవచ్చు. రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ హక్కులు, బాధ్యతల్లో ఎటువంటి మార్పులు లేవు. రీకన్‌స్ట్రక్టెడ్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం పొందే హక్కు ఖాతాదారులకు ఉండదు. యస్ బ్యాంక్ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పారితోషికం యథాతథంగా కొనసాగుతాయి.