Sunday, May 9, 2021

Latest Posts

చరిత్ర సృష్టించిన ఆర్‌సి‌బి, ఫ్యాన్స్ హ్యాపీ

RCB Creates History

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాపులర్ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, గత 13 ఎడిషన్లలో ఆర్‌సిబి ఎప్పుడూ ఐపిఎల్ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఈ సీజన్‌లో అయినా కప్ గెలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజాగా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నెలబెడుతూ 2021 ఎడిషన్‌లో ఆడిన మూడు మ్యాచ్లలో మూడింటిని ఆర్‌సిబి గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సిబి తొలి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. మునుపటి సీజన్లలో కంటే జట్టు ఈ సారి సమతుల్యంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఎబి డివిలియర్స్ మరియు గ్లెన్ మాక్స్వెల్ వంటి వారితో బ్యాటింగ్ పవర్ హౌస్ లా కనిపిస్తుంది. బౌలింగ్ హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, కైల్ జామిసన్, మరియు యుజ్వేంద్ర చాహల్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో మిగిలిన జట్ల కంటే ఆర్‌సిబి బలంగా కనిపించడం విశేషం.

రాబోయ మ్యాచ్‌లలో వారు ఇదే ఫామ్‌ను కొనసాగించగలిగితే, వారు పాయింట్ల పట్టికలోని మొదటి రెండు స్థానాల్లో సులభంగా స్థానం సంపాదించగలరు. ఆర్‌సిబి ఇప్పటికే టేబల్ టాపర్స్ గా ఉంది. ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ హోల్డర్లు ఇద్దరూ కూడా ఈ జట్టుకు చెందినవారే కావడం విశేషం. ఇదంతా చూసి ఆర్‌సి‌బి అభిమానులు ఈ సాలా కప్ నమ్దే అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss