Sunday, May 9, 2021

Latest Posts

ఈ రోజు జరగాల్సిన ఆర్‌సి‌బి vs కే‌కే‌ఆర్ మ్యాచ్ వాయిదా

RCB vs KKR Match Postponed

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కి కరోనా దెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం అనగా ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేయడానికి బిసిసిఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం కెకెఆర్ శిబిరంలో కోవిడ్ శోకిందని ఒక ప్లేయర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

మిగిలిన ప్లేయెర్స్ అంతా ఐసోలేషన్ లోకి వెళ్లనున్నారని సమాచారం. బిసిసిఐ సోమవారం జరిగే మ్యాచ్ ని రీషెడ్యూల్ చేయాలని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ని కోరిందని వారు దీనికి ఒప్పుకున్నారని సమాచారం. అయితే కరోనా ఎవరికి శోకిందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

ఇకపోతే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్లలో పది పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss