Sunday, January 24, 2021

Latest Posts

RDX లవ్ మూవీ రివ్యూ..!!

నటీనటులు: తేజస్ కంచర్ల, పాయల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీనన్, వీకే నరేష్, నాగినీడు తదితరులు
బ్యానర్ : హ్యాపీ మూవీస్
మ్యూజిక్ : రతన్
సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్
డైరెక్టర్ : భాను శంకర్
ప్రొడ్యూసర్ : చ.కళ్యాణ్
విడుదల తేదీ : 11 అక్టోబర్ 2019

RX100 సినిమా తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ సినిమా తో హీరో కి ఏమో గానీ ఈ హీరోయిన్ కి మంచి పేరుతో పాటు వరుస అవకాశాలు కూడా వచ్చాయి.. ఆమె తాజాగా నటించిన చిత్రం RDX లవ్.. ‘అర్ధనారీ’ ఫేమ్ భాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లతో మంచి పేరు దక్కించుకోగా, ఈరోజే రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథ విషయానికొస్తే,

అలివేలు (పాయల్ రాజ్ పుట్) ఓ పల్లెటూరికి చెందిన ఆధునిక యువతి. ఎలా అయినా సరే తమ ఊరికి బ్రిడ్జ్ వేయించాలని తన తండ్రి ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తున్న తన తండ్రికి సహాయం అందించాలనుకొంటుంది. అయితే.. అమ్మాయిగా తన అందాలను అస్త్రాలుగా సంధించి ఈ కార్యాన్ని నెరవేర్చాలనుకొంటుంది. అందుకోసం అలివేలు చేసిన చిత్రవిచిత్రమైన పనుల యొక్క సమాహారమే ‘ఆర్ డి ఎక్స్ లవ్’ కథాంశం.

నటీనటులు :

హీరో హీరోయిన్ పాత్రలను వేర్వేరుగా చూస్తే ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ఇద్దర్నీ జంటగా చూస్తే కెమిస్ట్రీ కుదరలేదు. హీరో తేజస్ కంటే హీరోయిన్ పాయల్ పెద్దదిగా కనిపించింది. మిగతా నటీనటుల్లో ఆదిత్య మీనన్, నాగినీడు, నరేష్ బాగా చేశారు. అనుభవంతో పాత్రలను చేశారు. తులసి పాత్ర ఎమోషనల్ గా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

‘అర్ధనారి’ వంటి అర్థవంతమైన సినిమా తీసిన దర్శకుడి నుండి ఇటువంటి సినిమా రావడం ఆశ్చర్యపరుస్తుంది. దర్శకుడి ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ప్రభుత్వ పథకాల పేరుతో తీసిన సన్నివేశాలు అన్నీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. లక్ష్య సాధన కోసం హీరోయిన్ ఎంచుకున్న దారి సబబుగా అనిపించదు. దిగజారుడు కింద అనిపిస్తుంది. ట్విస్టుల సంగతి పక్కన పెడితే… సినిమా మెయిన్ కాన్సెప్ట్ రవితేజ ‘భగీరథ’ సినిమా కాన్సెప్టే. నిడివి ఎక్కువైంది. కండోమ్ వాడకం, వాత్సాయన కామసూత్ర ప్రచారం పక్కన పెడితే… కొన్ని సన్నివేశాల్లో డైలాగులు పర్లేదు. రధన్ పాటల్లో గుర్తుంచుకునేవి లేవు. నేపథ్య సంగీతం హింస పెట్టింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్ :

పాయల్ రాజ్ పుత్

మైనస్ పాయింట్స్ :

కథ

సాగతీత

చివరగా : RDX పేలలేదు..

రేటింగ్ : 2.5/5

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss