Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

గంటా శ్రీనివాసరావు టీడీపీ లోనే ఉండిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే..!!

Real reason behind Ganta Srinivasa Rao staying in TDP:

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణక్యం ఆయనకు తప్ప ఎవరికీ అర్ధం కాదు. అన్నీ సర్దుకుని కండువా మార్చేంతవరకూ పార్టీ మారినట్లు కాదని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. వైసీపీ, బీజేపీ అంటూ ఇన్నాళ్ళు ప్రచారం జోరుగా సాగినా మౌనం వహించిన గంటాశ్రీనివాసరావు ఇపుడు తాను టీడీపీలోనే ఉన్నానంటూ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. గంటా ఇలా అడ్డం తిరగడంతో టీడీపీలో సంతోషం కంటే షాకింగే ఎక్కువగా కనిపిస్తోంది.

గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఖాయమనుకున్నా తమ్ముళ్లకు ఇపుడు గంటా ఇచ్చిన బిగ్ ట్విస్ట్ తో మతిపోయినంత పనైంది. గంటా నిజంగా టీడీపీలోనే ఉన్నారా, ఇకపై కూడా ఉంటారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. గంటా శ్రీనివాసరావు ఇపుడు ఒక్కసారిగా గొంతు కూడా మార్చేశారు. వైసీపీది నియంత పాలన అంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయిదు నెలల వైసీపీ పాలనలో ప్రజా వ్యతిరేకత వెల్లువలా ఉందని ఆయన అంటున్నారు. ప్రజలు ఇసుక కొరతతో

నానా అవస్థలు పడుతున్నారని, టీడీపీ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయడమే తప్ప అభివ్రుధ్ధి ఎక్కడిది అంటూ గంటా శ్రీనివాసరావు నిలదీస్తున్నారు. ఇక అంతటిలో వూరుకోకుండా జగన్ గాలి ఎక్కడ వీచినా విశాఖలో వీచకుండా తాము అడ్డుకున్నామని ఘనంగా చెప్పుకున్నారు. వరసగా నలుగురు సిటీ ఎమ్మెల్యేలు గెలవడం టీడీపీ ఘనవిజయం అని ఆయన అన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనూ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ గొప్ప విజయం ఖాయమని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి వైసీపీకి వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు గొంతు సవరించుకోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనెకాల కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉండిపోవడం వెనక అసలు గుట్టు వేరే ఉందని సొంత పార్టీలో ఆయన వైరి వర్గం ప్రచారం చేస్తోంది. వైసీపీలో గంటా శ్రీనివాసరావును తీసుకోలేదని, ఆయన షరతులకు జగన్ ఒప్పుకోలేదని కూడా చెప్పుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉన్న ఆ సీటు కూడా కోల్పోతారు తప్ప జగన్ ఏమీ ఇవ్వరని కూడా అంటున్నారు. దాంతోనే జగన్ అక్కడ డోర్స్ క్లోజ్ చేయడంతోనే మళ్లీ టీడీపీయే గతి అయిందంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉంటానని సంకేతాలు ఇచ్చినా కూడా ఈ ముచ్చట ఎన్నాళ్ళు అన్న మాట కూడా టీడీపీ నుంచే వినిపిస్తోంది. చూడాలి మరి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసలైన రాజకీయం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...