Monday, July 26, 2021

Latest Posts

మా సహనాన్ని పరీక్షించొద్దు రేవంత్ రెడ్డి వార్నింగ్

Reavnth Reddy Warning To State And Central

దేశంలో మండుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో చేప‌డుతోన్న ఆందోళ‌న‌లు పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ  అడ్డుకుంటున్నారు. తాజాగా ఈ రోజు ‘చలో రాజ్‌భవన్‌’ వద్ద నిరసనలు చేపట్టడానికి వెళ్తున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు మరో సారి అడ్డుకున్నారు.

దీని పై తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిప‌డ్డారు. తాము శాంతియుతంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తామ‌ని, ధ‌ర్నాచౌక్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు నిరసనకు అనుమ‌తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా ముంద‌స్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చరించారు.

అరెస్టు చేసిన నాయకులను పోలీసు వారు విడిచిపెట్టాల‌ని, శాంతియుత నిర‌స‌న‌ల‌ను ఇలా అడ్డుకుంటె పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయిని చెప్పారు. ఎంత మందిని అరెస్టు చేసిన త‌మ నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ప‌న్నుల‌ను పెంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోపిడీ చేస్తున్నాయ‌ని, దీని ప‌రిష్కారం కోసం తాము కొట్లాడేందుకు కూడా వెన‌కాడ‌బోమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss