Monday, March 1, 2021

Latest Posts

అందరి అంచనాలను తారు మారు చేసిన రెడ్ మూవీ కలెక్షన్లు

Red Movie Box Office Collection

ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ పోతినేని నటించిన తెలుగు చిత్రం, రెడ్. ఈ చిత్రం ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. అలాగే అందరూ ఊహించిన విధంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటంతో, ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి థియేటర్లకు క్యూ కట్టారు. కానీ సినిమా చూసిన తరువాత మాత్రం ప్రేక్షకులు రెడ్ కి మిక్స్డ్ రివ్యూ ఇచ్చారు.

ఏది ఏమి అయినప్పటికీ, ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజున అందరి అంచనాలను తారుమారు చేస్తూ రూ.6.7 కోట్లు వసూలు చేసింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టడంతో హీరో రామ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా రెడ్‌ కలెక్షన్ల తాజా అప్‌డేట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 6.7 కోట్ల షేర్స్‌ రాగా గ్రాస్ కలెక్షన్స్ 8.9 కోట్లుగా ఉండొచ్చని సమాచారం. ఇదే నిజమైతే రామ్ సినిమా చరిత్రలో మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టే. రామ్ డబుల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా శ్రీ శ్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో కృష్ణ చైతన్య మరియు శ్రవంతి రవి కిషోర్ బ్యాంక్రోల్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss