Monday, April 19, 2021

Latest Posts

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

remuneration-venakki-icchi-nastaanni-teerchanunna-pawan-kalyan

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చి నష్టాన్ని తీర్చనున్న పవన్ కళ్యాణ్!

     తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోనే అయినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన పవన్… ఈ క్రమంలోనే పలు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. ఓ విషయంలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.!

రీఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకుండానే పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. అలాగే, క్రిష్ జాగర్లమూడితో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్నింటిని పట్టాలెక్కించబోతున్నాడట పవన్. పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించబోతుండడంతో ఆయన రెమ్యూనరేషన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగానే పవన్ మూడు సినిమాలకు కలిపి రూ. 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో నిర్మాతకు నష్టాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చడానికే పవన్.. ఆయనకు కొంత డబ్బును వెనక్కి ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss