ఈ మధ్య సోషల్ మీడియాలో రూమర్స్ సెలబ్రిటీల కొంప ముంచుతున్నాయి. అంతే కాదు ఈ రూమర్స్ నే జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు. నిజానిజాలు తెలీకుండానే ఈ రూమర్స్ ని తెగ స్ప్రెడ్ చేస్తున్నారు. దీనితో చాలా మంది సెలబ్రిటీల కొంప ముంచుతున్నారు. తాజాగా ఇదే ఘటన రేణు దేశాయి కొంప ముంచింది.
ఇంతకీ రూమర్ ఏంటంటే హీరో పపన్ కల్యాణ్ మాజీ భార్య, రేణు దేశాయ్‌కు కరోనా సోకిందంటూ ఓ వార్త తెగ వైరల్ అయింది. దీంతో కలవరపడ్డ కొందరు పవన్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయంపై స్పందించిన రేణూ దేశాయ్ తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కరోనా రిపోర్టును కూడా షేర్ చేశారు.
అంతే కాకుండా తన పై తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారి పై గుర్రుమన్నారు. ఇప్పటికే నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నిన్న ఓ ఫంక్షన్‌కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నాకసలు బాధ్యత లేని మనిషిని అన్నట్లుగా చూపులతో గుచ్చారు. అందుకే ఈ పోస్టు పెడుతున్నా. నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను, అంతేకాదు బాధ్యత గల వ్యక్తిగా ఎటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవను అని ఆమె స్వయంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: