Renu desai Is Ready To Act As Superstar Mother
కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక షూటింగ్స్ కేన్సిల్ కావడంతో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. ఇంట్లోనే ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ప్రజలకు కరోనా నుండి జాగ్రత్తలు పాటించాలని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తున్నప్పుడు నెటిజన్లు అడిగే గమ్మత్తైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా’ అని ఓ నెటిజన్ అడగడంతో రేణు దేశాయ్ కూడా చాలా కూల్ గా బదులిచ్చింది. ‘హీరోల చిన్నతనం లోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని’ సమాధానం చెప్పింది.
ఇక ‘తనను ముసలి లుక్లో బాగా చూపింగలరనే నమ్మకం దర్శకులకు ఉంటే మాత్రం తనకు మహేష్ బాబు లాంటి హీరోలకు తల్లిగా నటిచేందుకు సిద్ధమేనని’ రేణు తెలిపింది. ‘మేమంతా ఆర్టిస్టులం.. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు రెడీగా ఉండాలి’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. నిజానికి మహేష్ బాబు కంటే వయసులో రేణు దేశాయ్ 8 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం రేణూ దేశాయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని ‘నాని’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు అమ్మగా నటించింది. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా అమ్మగా నటించడానికి ఆసక్తి చూపిస్తోంది అంటూ పోలుస్తున్నారు.
‘బద్రి’ ‘జానీ’ సినిమాలలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన రేణు.. పవన్ కళ్యాణ్ తో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే సినిమాలకు దూరమైన ఇన్నేళ్ళలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటోంది. అయితే సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు అంటూ పలుమార్లు మీడియా ప్రశ్నించగా మంచి పాత్రలు దొరికితే మళ్లీ నటించడానికి సిద్ధమే అంటూ రేణు చెప్పుకొచ్చింది. అయితే పూరి జగన్నాథ్ ఆమెతో నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా అప్పట్లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉండేది. వారు విడిపోయిన తర్వాత మరాఠీ చిత్రానికి దర్శకత్వం కూడా వహించింది. ఆమె దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా’ సినిమాలో కొడుకు అకీరా నందన్ కూడా యాక్ట్ చేశాడు