Sunday, June 20, 2021

Latest Posts

కరోనా పై తనదైన రీతిలో స్పందించిన రేణు దేశాయి

Renu Desai Response On Corona
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. సమాజంలోని సమస్యలపై మాట్లాడటంలో, తన అభిప్రాయాలు పంచుకోవడంలో ముందు ఉంటారు ఈమె. తాజాగా కరోనా పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రేణు ఏమన్నారంటే,’బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికే మన శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందంగా ఉండాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య ఇరుక్కుపోయాం. అయితే ఆనందంగా జీవించడానికి ఏది అవసరమో అదే చేయండి. స్టాండప్‌ కామెడీ వీడియోలు కానీ, క్యూట్‌ పప్పీల వీడియోలు చూడండి. ఈ కష్టకాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు అన్నీ వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ఈ జీవన గమనంలో ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి’ అంటూ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss