Monday, May 10, 2021

Latest Posts

అమెరికాలోనూ పెళ్లిళ్లపై ఆంక్షలు

Restrictions on marriages in America due to lockdown effect

మాయదారి కరోనా విజృంభణతో ఈ ప్రపంచంలో పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. అంగరంగ విభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా సాగిపోతున్నాయి. పదిమంది మించి జనం ఉండకూడదన్న నిబంధన మనదేశంలోనే కాదు అమెరికాలాంటి దేశాల్లో కూడా అమలుచేస్తున్నారు. మంచి ముహూర్తం  .. కానీ  లాక్ డౌన్ నిబంధనలు .. అందుకే తప్పవు ఇవన్నీ … తాజాగా కరోనా ప్రభావంతో కన్న కొడుకు పెళ్లిని సైతం ఆ తల్లిదండ్రులు వీక్షించలేకపోయారు.

చివరకు ఆన్‌లైన్‌లో వీక్షించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అమెరికాలో ఈ నెల 17 జరిగిన వివాహం  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరానికి చెందిన సీనియర్‌ అడ్వకేట్‌, జాతీయ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ స్వామి రమేష్‌ రెండవ కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.  అతనికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన అమెరికా సెటిలర్స్‌ కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది.

వీరిద్దరికీ  అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్న ఆ కుటుంబాలకు అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభించడం వలన  అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అక్కడకు వెళ్లలేక పోగా, అక్కడ పెళ్లి తంతులో పది మందికంటే ఎక్కువగా  ఉండరాదనే నిబంధనతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆన్‌లైన్‌లో పెళ్లి చూస్తూ లక్షింతలు వేసి ఆశీర్వదించారు. కేవలం పది మంది బంధుమిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం పసుపుకొమ్ముతో తాళిని వధువు మెడలో కట్టడంతో పెళ్లితంతు పూర్తయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss