Wednesday, April 21, 2021

Latest Posts

ప్రారంభం కానున్న విమాన సర్వీసులు

దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌర విమానయానశాఖ విడుదల చేస్తుందని, విమాన సర్వీసులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, ఎయిర్ క్యారియర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి చివరి వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో కార్గో విమానాలు, వైద్యపరమైన అవసరం ఉన్న విమానాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా, కొన్ని రోజుల క్రితం విదేశాలలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి కొన్ని ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది కేంద్రం.

ఇది చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss