Tuesday, January 25, 2022

Latest Posts

రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి కాంగ్రెస్ పీఠం కొన్నాడు – కౌశిక్ రెడ్డి

Revanth Reddy Buys PCC Chief With 50 Crores

తెలంగాణ కాంగ్రెస్‌లో సోమవారం నాటకీయం చోటు చేసుకుంది. ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు తాను టీఆర్‌ఎస్ తరపున రంగంలోకి  దిగబోతున్నట్లుగా కాంగ్రెస్ నాయకుడు అయిన కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయి. దీనితో వెంటనే అతనికి కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది.

24 గంటల్లో దీని పై సమాధానం చెప్పాలని ఆదేశించింది. చివరికి సాయంత్రం అతనిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయంపై కౌశిక్ రెడ్డి మండి పడ్డాడు. కౌశిక్‌ మీడియా తో మాట్లాడుతూ, తానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలిపాడు. రేవంత్‌ రెడ్డి 50 కోట్ల రూపాయిలు పెట్టి పీసీసీ పీఠంను కొనుగోలు చేశాడంటూ కౌశిక్‌ ఆరోపించాడు. హుజురాబాద్‌ లో తనకు కాకుండా సీటు మరొకరికి ఇచ్చేందుకు రేవంత్‌ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నాడు. అందుకే నేను పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాని కౌశిక్ తెలిపాడు. హుజురాబాద్‌ లో కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేరు అంటూ రేవంత్‌ రెడ్డికి కౌశిక్‌ ఛాలెంజ్‌ విసిరాడు. దీనితో ఇప్పుడు అతను టి‌ఆర్‌ఎస్ పార్టీలో చేరతాడా ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss